• facebook
  • whatsapp
  • telegram

భారత్‌లో నంబర్‌ 1 ఐఐఎస్‌ బెంగళూరు

* టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆసియా టాప్ 100లో 8 భారతీయ సంస్థలు
8 500ల్లోపు ర్యాంకుల్లో ఆరు తెలుగు రాష్ట్రాల విద్యాలయాలు
ఈనాడు - దిల్లీ
టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆసియా ర్యాంకుల్లో తొలి వంద స్థానాల్లో భారత్‌కు చెందిన 8 సంస్థలు నిలిచాయి. 500లోపు ర్యాంకులను తెలుగురాష్ట్రాలకు చెందిన ఆరు విద్యాసంస్థలు దక్కించుకున్నాయి. భారత్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌), బెంగళూరు తొలిస్థానంలో నిలవగా, తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌ ఐఐటీ ఆ గౌరవాన్ని దక్కించుకుంది. ఐఐఎస్‌కు ఆసియాలో 36 ర్యాంకు దక్కింది. ఈసారి దిల్లీ, బాంబే ఐఐటీలను తోసిరాజని పంజాబ్‌లోని రోపార్‌, పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పుర్‌, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఐఐటీలు ముందు వరుసలో నిలిచాయి. 2016 తర్వాత ఇన్ని విద్యాసంస్థలు ఆసియాలో వందలోపు ర్యాంకుల్లో నిలవడం ఇదే ప్రథమం. దేశంలో పోటీ పెరగడంతో ఈసారి పంజాబ్‌లోని ఐఐటీ రోపార్‌ టాప్‌లోకి వచ్చింది. 2019తో పోలిస్తే ఐఐటీ ఖరగ్‌పుర్‌, ఐఐటీ దిల్లీలు మాత్రమే తమ ర్యాంకును మెరుగుపరుచుకున్నాయి.