• facebook
  • whatsapp
  • telegram

ఇన్‌స్పైర్‌ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరానికి (2020-21) ఇన్‌స్పైర్‌ పురస్కారాల కోసం జరిగే పోటీలకు 6-10 తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సంచాలకురాలు శేషుకుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు పూర్తి వివరాలను www.scert.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
* డీఈఈసెట్‌ దరఖాస్తులకు గడువు పెంపు
డీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జూన్‌ 18 వరకు గడువు పొడిగించినట్లు కన్వీనర్‌ కృష్ణారావు తెలిపారు. ఇతర వివరాలను ‌www.deecet.cdse.telangana.gov.in  ద్వారా పొందవచ్చు.