• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కంటే ముందుగానే గ్రూప్‌-1 మెయిన్స్‌!

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణపై పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పునరాలోచన చేస్తోంది. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను అక్టోబరు తొలివారంలో నిర్వహిస్తామని తాజాగా యూపీఎస్సీ ప్రకటించింది. తొలుత భావించిన ప్రకారం యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను ఆగస్టు, ఆ మధ్యలో నిర్వహిస్తుందని ఏపీపీఎస్సీ ఆలోచన చేసింది. దీనికి అనుగుణంగా గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలను సివిల్స్‌ ప్రిలిమ్స్‌ తర్వాత నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ సూచనప్రాయంగా తెలిపింది. అయితే.. అనుకోని రీతిలో యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను అక్టోబరు తొలివారం నిర్వహిస్తామని ప్రకటించింది. సమయం ఎక్కువ ఉన్నందున అంతకంటే ముందుగానే గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీకి అభ్యర్థనలు వస్తున్నాయి. వీటిపై పరిశీలన జరిపి తగిన నిర్ణయాన్ని తీసుకుంటామని ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు వెల్లడించారు.

  • Tags