• facebook
  • whatsapp
  • telegram

ఫార్మసీ డిగ్రీల రిజిస్ట్రేషన్‌కు ‘స్లాట్‌ బుకింగ్‌’

ఈనాడు, అమరావతి: ఫార్మసీలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు త్వరలో ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని ప్రారంభిస్తామని ఏపీ ఫార్మసీ కౌన్సెల్‌ తెలిపింది. ఈ మేరకు జాతీయ విజ్ఞాన కేంద్రం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రిజిస్ట్రార్‌ రామ్మూర్తి చెప్పారు. ఇందుకోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే అన్ని ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగ నియామకాల కోసం పెట్టుకునే దరఖాస్తుల్లో అభ్యర్థులు ఈ రిజిస్ట్రేషన్‌ వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే అత్యవసరమైన వారికి ప్రస్తుతం నేరుగా వస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తామని రిజిస్ట్రార్‌ హామీ ఇచ్చారు. జూన్‌ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోనే ‘స్లాట్‌ బుకింగ్‌’ సౌకర్యం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

  • Tags