• facebook
  • whatsapp
  • telegram

ప్రైవేటు వైద్య కళాశాలలకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పీజీ వైద్య కళాశాలల్లో అభ్యర్థులను చేర్చుకోని ప్రైవేటు యాజమాన్యాలపై ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలకు శ్రీకారం చుట్టింది. తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుంటూ అన్ని ప్రైవేటు కళాశాలలకు జూన్ 5న‌ సర్క్యులర్లను పంపించింది. జూన్‌ 8వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోగా యాజమాన్యాలు తమ అభిప్రాయాలను చెప్పాలని పేర్కొంది. సమాధానం ఇవ్వని, విద్యార్థులను చేర్చుకోని కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసేందుకు సన్నద్ధం అవుతోంది. సీటు కేటాయించిన విద్యార్థులను తప్పకుండా చేర్చుకోవాలని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శంకర్‌ పేర్కొన్నారు.

  • Tags