• facebook
  • whatsapp
  • telegram

పురపాలక శాఖలోకి పంచాయతీరాజ్‌ పాఠశాలలు

ఈనాడు, అమరావతి: నగర, పురపాలక, నగర పంచాయతీల పరిధిలోని పంచాయతీరాజ్‌ పాఠశాలలను పురపాలక శాఖలో విలీనం చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు పురపాలక శాఖ కమిషనర్‌ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,184 జిల్లా, మండల పరిషత్తు పాఠశాలలను విలీనం చేయాలని కోరారు. నగర, పురపాలక సంస్థల విస్తరణ కారణంగా ఈ పాఠశాలలు పురపాలక శాఖ పరిధిలోకి వచ్చాయి. రాష్ట్రంలోని 61 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఒక్క పురపాలక పాఠశాల లేకపోగా.. వీటిల్లో 178 జడ్పీ, 1,015 మండల పరిషత్తు పాఠశాలలు ఉన్నాయి. మరో 59 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 991 పంచాయతీరాజ్‌ పాఠశాలలు ఉన్నట్లు పురపాలక శాఖ అధికారులు లెక్క తేల్చారు.