• facebook
  • whatsapp
  • telegram

ఆగస్టులో డిగ్రీ, ఇంజినీరింగ్‌ తరగతులు

ఈనాడు, అమరావతి: కరోనా కారణంగా ఉన్నత విద్యా సంస్థల ప్రారంభం నెల రోజులు ఆలస్యం కానుంది. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఆగస్టు 3 నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే విద్యాసంవత్సరం తరగతుల ప్రారంభం, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న పాఠ్యాంశాలు, పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా అకడమిక్‌ కేలండర్‌ను రూపొందించింది. తరగతులకు 50 శాతం మంది విద్యార్థులనే అనుమతించనున్నారు. విడతలవారీగా కొంతమందికి ఆన్‌లైన్‌, మరికొందరికి నేరుగా తరగతులు నిర్వహించనున్నారు. తరగతి గదుల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. విద్యార్థులు, అధ్యాపకులకు చేతులు కడుక్కోవడానికి సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. మాస్కులను తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.
జులైలో సెమిస్టర్‌ పరీక్షలు
* లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పాఠ్యాంశాలు పెండింగ్‌లో పడ్డాయి. వీటిని జూన్‌ 30లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
* గ్రాడ్యుయేషన్‌, పోస్టుగ్రాడ్యుయేషన్‌ చివరి సెమిస్టర్‌ పరీక్షలను జులై 1 నుంచి 15లోపు పూర్తి చేయాలి. మిగతా 15 రోజుల్లో మూల్యాంకనం పూర్తి చేయాల్సి ఉంటుంది.
* ప్రయోగాత్మక పరీక్షలు, ఇతర థియరీ పరీక్షలను జులై చివరినాటికి ముగించాలి.
డిగ్రీ, ఇంజినీరింగ్‌ తరగతులు..
* డిగ్రీ (3,5 సెమిస్టర్‌) బీటెక్‌ (3,5,7 సెమిస్టర్‌) తరగతులు ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశం.
* ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలోకి ప్రవేశించేవారికి ఆగస్టు 17 నుంచి తరగతులు.
* డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు సెప్టెంబరు 15 నుంచి.
* డిగ్రీ సెమిస్టర్‌ 3, 5 పరీక్షలు డిసెంబరులో నిర్వహిస్తారు.
* డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు జనవరిలో మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి.
* ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది విద్యార్థులకు సెప్టెంబరు 2 నుంచి తరగతులు ఉండే అవకాశం ఉంది.
* ఎంబీఏ, ఎంసీఏ వారికి సెప్టెంబరు 7 నుంచి తరగతులు నిర్వహించే అవకాశం