• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో ఇంటర్‌ ఫలితాలు

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ ఫలితాలను మొదటిసారిగా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. గతంలో సీడీల్లో విడుదల చేసేవారు. ఈసారి క్లౌడ్‌ సర్వీసుతో ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. వచ్చే వారంలో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నారు. కరోనా కారణంగా సమావేశాలు నిర్వహించే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాలు కావాలనుకునే వెబ్‌సైట్ల నిర్వాహకులు ముందుగా వివరాలు సమర్పించాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.