• facebook
  • whatsapp
  • telegram

ఏయూకి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయిలో ‘నేచర్‌ ఇండెక్స్‌’ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) నాలుగో ర్యాంకు సాధించిందని ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 300 కుపైగా ఉన్నత విద్యాసంస్థలు పోటీపడ్డాయన్నారు. విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యపడిందని చెప్పారు.