• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థులను చేర్చుకోరట.. ఏం చేయాలి?

* పీజీ వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వానికి విశ్వవిద్యాలయం లేఖ
 

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: పీజీ మెడికల్‌, దంత వైద్య విద్యార్థులను చేర్చుకోలేమని ప్రైవేటు వైద్య కళాశాలలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో సూచించాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆయా కళాశాలలకు విశ్వవిద్యాలయం ఇప్పటికే సర్క్యులర్‌, మెమోలు జారీ చేయగా జూన్ 9న‌ సమాధానమిచ్చాయి. విద్యార్థులను చేర్చుకుంటే ఆర్థిక భారంతో కళాశాలలు మూసుకోవాల్సి వస్తుందని, విశ్వవిద్యాలయ నిబంధనలకు కట్టుబడే ఉంటామని బదులిచ్చాయి. వర్సిటీ ఈ సమాధానాలు క్రోడీకరించి ప్రభుత్వానికి విన్నవించింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పాలని లేఖలో కోరింది. జూన్ 10న‌ మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థులు కళాశాలల్లో చేరాల్సిన గడువు ముగియనుంది.

  • Tags