• facebook
  • whatsapp
  • telegram

‘మను’ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మను) నిర్వహిస్తున్న వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ గడువును జూన్‌ 20 వరకు పొడిగించారు. గతంలో దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 10 చివరి తేదీగా ప్రకటించగా.. ప్రస్తుతం దాన్ని మరో పది రోజులు పొడిగిస్తున్నట్లు వర్సిటీ డైరెక్టర్‌ ఎం.వనజ ప్రకటించారు. ఎడ్యుకేషన్‌, లాంగ్వేజెస్‌, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌, టెక్నాలజీ, మాస్‌ కమ్యూనికేషన్‌ జర్నలిజం, కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ఇలా వేర్వేరు విభాగాల్లో 25 పీహెచ్‌డీ, 21 పీజీ, 8 యూజీ కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రవేశ పరీక్ష జులై 4, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పించే కోర్సుల దరఖాస్తుల దాఖలుకు ఆగస్టు 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.

  • Tags