• facebook
  • whatsapp
  • telegram

‘అంబేడ్కర్‌ సార్వత్రిక’ ప్రవేశ పరీక్ష జులై 12న

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు జులై 12న తెలుగు రాష్ట్రాల్లో అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు జూన్ 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.braouonline.inవెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. పరీక్షలు వాయిదా: బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) మొదటి సెమిస్టర్‌, బీఎడ్‌ బ్యాక్‌లాగ్‌, ఎంబీఏ మొదటి సంవత్సరం, ఎంబీఏ(హాస్పిటల్‌, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) పరీక్షలు, డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ)కి సంబంధించిన అన్ని పరీక్షలను జులైలో నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో కానీ, 040-23680240, 241, 291 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చన్నారు.

  • Tags