• facebook
  • whatsapp
  • telegram

వైద్య, ఆరోగ్యశాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతి

ఈనాడు, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం జూన్ 10న‌ ఉత్తర్వులిచ్చింది. వైద్య విద్య, వైద్య విధానపరిషత్తు, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో వీటిని భర్తీ చేయనున్నారు.
* ప్రస్తుతం ఉన్న స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్ల ఖాళీల్లో 2,186 మందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
* వైద్య విద్య, ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్తులో 1,021 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఖాళీగా 804 ఉన్న సహాయ ఆచార్యులు, అసిస్టెంట్‌ సర్జన్‌, దంత సహాయ సర్జన్‌ పోస్టులు భర్తీ చేస్తారు.