• facebook
  • whatsapp
  • telegram

‘విజ్ఞాన్‌’లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని ‘విజ్ఞాన్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీ’లో జూన్ 10 నుంచి నుంచి బీటెక్‌, బీఫార్మసీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభించినట్టు వర్సిటీ ఉప కులపతి డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. సమీప విద్యార్థులు నేరుగా వచ్చి ప్రవేశాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, అడ్మిషన్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎం.రవికుమార్‌, ఐటీ సర్వీసెస్‌ డీన్‌ డాక్టర్‌ కేవీ కృష్ణకిషోర్‌ పాల్గొన్నారు.