• facebook
  • whatsapp
  • telegram

ఉపాధ్యాయ పోస్టులపై తీర్పును సమీక్షించండి: గిరిజన సంఘాలు

ఈనాడు, దిల్లీ: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ఏపీ, తెలంగాణ గిరిజన సంఘాలు సుప్రీంకోర్టును కోరాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ గిరిజన సంఘాల తరఫున న్యాయవాది రమేశ్‌ అల్లంకి జూన్ 10న‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులు వందశాతం స్థానిక గిరిజనులకే కేటాయిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షంచాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దండకారణ్య లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున భాజపా ఎంపీ సోయం బాపూరావు, ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక అసోసియేషన్ల తరఫున 22 పిటిషన్లు దాఖలయ్యాయి.