• facebook
  • whatsapp
  • telegram

‘పది’ విద్యార్థులకు గ్రేడ్లపై జీవో

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండా అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చేందుకు జీఓ జారీ అయింది. కరోనా పరిస్థితుల కారణంగా 2019-20 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. పది విద్యార్థులు నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)లలో చూపిన ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు.
వీణావాణీలకు 9కిపైగా గ్రేడ్‌!
అవిభక్త కవలలు వీణావాణీలు ఇద్దరికీ పదో తరగతి పరీక్షల్లో 9కిపైగా జీపీఏ వచ్చే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. అంతర్గత పరీక్షల ప్రకారం వారు మొత్తం ఆరు సబ్జెక్టుల్లో 120కి సుమారు 103-107 మధ్యలో మార్కులు పొందారని వెంగళరావునగర్‌ ఉన్నత విద్య పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధనుంజయ్‌ చెప్పారు. అంటే మార్కులు 500 దాటనున్నాయి. గ్రేడ్ల విధానం ఉండటంతో 9కిపైగా గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ) కచ్చితంగా దక్కుతుందని, 9.5 జీపీఏ వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని తెలిపారు.