• facebook
  • whatsapp
  • telegram

ఓయూ డిగ్రీ పరీక్షల రుసుము గడువు పెంపు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల రుసుము చెల్లింపు గడువును జూన్‌ 18 వరకు పెంచుతున్నట్లు పరీక్షల విభాగం నియంత్రణాధికారి శ్రీరామ్‌ వెంకటేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 10 వ‌ర‌కు వరకు ఉన్న గడువును తాజాగా పొడిగించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీడబ్ల్యూ కోర్సుల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.