• facebook
  • whatsapp
  • telegram

సెల్ఫ్‌ సెంటర్లలోనే చివరి సెమిస్టర్‌ పరీక్షలు

బీటెక్‌ నాలుగో ఏడాది చివరి సెమిస్టర్‌ పరీక్షలను ఈసారి ఏ కళాశాల విద్యార్థులు అదే కళాశాలలో రాసే అవకాశం ఇవ్వాలని జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యార్థులు తమ కాలేజీలో కాకుండా ఇతర కళాశాలల్లో పరీక్షలు రాసే నిబంధన ఉండేది. ఈసారి సెల్ఫ్‌ సెంటర్లలోనే పరీక్షలు ఉంటాయి. కళాశాల యాజమాన్యాలే బస్సుల్లో విద్యార్థులను కళాశాలలకు తీసుకెళ్లవచ్చు. యాజమాన్యాలు అందుకు అంగీకరించాయని రిజిస్ట్రార్‌ గోవర్ధన్‌ తెలిపారు. బీటెక్‌ రెండు, మూడో సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబరులో పరీక్షలు ఉంటాయని, అయితే ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.