• facebook
  • whatsapp
  • telegram

అపరాధ రుసుంతో జూలై 4 వరకు ఐసెట్‌ గడువు

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న టీఎస్‌ఐసెట్‌కు రూ.500 అపరాధ రుసుంతో జూన్‌ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్‌ ఆచార్య కె.రాజిరెడ్డి జూన్ 10న‌ తెలిపారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో జూన్‌ 30 వరకు, రూ.5 వేలతో జులై 4 వరకు గడువును పొడిగించినట్లు చెప్పారు. దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే జూన్‌ 22 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సరి చేసుకోవాలని సూచించారు. జూన్‌ 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, జులై 13న ఐసెట్‌ పరీక్ష ఉంటుందని తెలిపారు. ప్రవేశపరీక్షకు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 10తో గడువు ముగిసిందన్నారు.