• facebook
  • whatsapp
  • telegram

ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్‌కు బోధన రుసుముల సమీక్ష అధికారం

ఈనాడు, అమరావతి: వృత్తి విద్యా సంస్థలకు నిర్ణయించిన బోధన రుసుములను సమీక్షించే అధికారం ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్‌కు లభించింది. తప్పుడు సమాచారం ఇచ్చిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం కూడా కమిషన్‌కు దాఖలాపడింది. సచివాలయంలో జూన్ 11న‌ జరిగిన సమావేశంలో..ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీమ్డ్‌ టు బీ వర్సిటీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై నియంత్రణ నిబంధనలను అమలు చేసే అధికారం కమిషన్‌కు లభించింది.