• facebook
  • whatsapp
  • telegram

ఆర్‌జీయూకేటీ పరీక్షలు వాయిదా

బాసర, న్యూస్‌టుడే: బాసర రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ)లో పీయూసీ-2, ఈ 4 విద్యార్థులకు నిర్వహించాల్సిన సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పీయూసీ-2, ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూన్‌ 18 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులు మొదట భావించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందుజాగ్రత్తగా పరీక్షలను వాయిదా వేశారు. విద్యాలయంలో పీయూసీ-1 ఈ1, ఈ2, ఈ3 విద్యార్థులను పరీక్షలు లేకుండా పై తరగతికి ప్రమోట్‌ చేయగా.. పోటీ పరీక్షల నేపథ్యంలో ఇంటర్‌ విద్యార్థులకు చివరి సెమిస్టర్‌ కావడంతో ఈ4 విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు బాసర ఆర్‌జీయూకేటీ పీఆర్‌వో మధుసూదన్‌రెడ్డి తెలిపారు.