• facebook
  • whatsapp
  • telegram

పదోతరగతిలో ఒక్క ఏడాదికే ఆరు పేపర్లతో పరీక్షలు

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ నేపథ్యంలో పదోతరగతి ప్రశ్నపత్రాలను 11నుంచి ఆరుకి కుదిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఈ ఒక్క ఏడాదికే వర్తిస్తుందని పేర్కొంది. అడ్వాన్స్‌డ్‌ సఫ్లిమెంటరీ పరీక్షలనూ ఈ ఆరు పేపర్లతో నిర్వహిస్తారు. ప్రశ్నలు 360 నుంచి 197కు తగ్గాయని వెల్లడించింది. పరీక్ష సమయం అర్ధగంట పెరిగిందని, ప్రశ్నలకు ఇచ్చే మార్కులను రెట్టింపు చేసినందున విద్యార్థులు తేలికగా మార్కులను పొందవచ్చని పేర్కొంది. సామాన్య శాస్త్రంలో ప్రశ్నపత్రాన్ని పార్ట్‌-ఏ, బీగా విభజించి, పార్ట్‌-ఏలో భౌతిక, రసాయన శాస్త్రం, పార్ట్‌-బీలో జీవశాస్త్రం ప్రశ్నలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జవాబుల బుక్‌లెట్‌, ఓఎమ్మార్‌ షీట్లను రెండు పార్ట్‌లకు విడివిడిగా ఇస్తారు.
టైపు, షార్టు హ్యాండ్‌ ఫలితాల విడుదల
ఈ ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో జరిగిన టైపు రైటింగ్‌, షార్టు హ్యాండు పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ కార్యదర్శి అరోజిరాణి ఒక ప్రకటనలో తెలిపారు.