• facebook
  • whatsapp
  • telegram

ప్రభుత్వ కళాశాలల వెనుకంజ

* తొలి ఏడాది 32, రెండో ఏడాదిలో 44 శాతమే ఉత్తీర్ణత

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ ఫలితాల్లో ప్రైవేటు కళాశాలలు, గురుకులాలతో పోల్చితే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు వెనకబడ్డాయి. తొలి ఏడాదిలో అత్యల్పంగా 32శాతం, ద్వితీయ సంవత్సరంలో 44శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కళాశాలల్లో చదివిన తొలి ఏడాది వారు 68శాతం, రెండో ఏడాది విద్యార్థులు 66 శాతం ఉత్తీర్ణులయ్యారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లోనూ అత్యల్ప ఫలితాలే నమోదయ్యాయి. తొలి ఏడాదిలో 47శాతం, రెండో ఏడాదిలో 50శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీఆర్‌జేసీ విద్యార్థులు అత్యధికంగా తొలి ఏడాదిలో 86 శాతం, ద్వితీయ సంవత్సరంలో 92 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఏపీఆర్‌జేసీ తర్వాత బీసీ సంక్షేమ గురుకులాల విద్యార్థుల ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. తొలి ఏడాదిలో 78 శాతం, రెండో సంవత్సరంలో 77 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది.