• facebook
  • whatsapp
  • telegram

గిరిజన వర్సిటీ ప్రవేశాలకు ప్రకటన

* జులై 30న పరీక్ష

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలోని గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది తొలిసారిగా మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సును ప్రవేశపెట్టారు. ఆసక్తిగల విద్యార్థులు జులై 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. జులై 30న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఇతర వివరాలకు ‌www.ctuapin.@www.andhrauniversity.edu.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రత్యేకాధికారి హనుమంతు లజపతిరాయ్‌ తెలిపారు.