• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞాన్‌కు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో 100వ ర్యాంకు

పొన్నూరు, న్యూస్‌టుడే: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకుల్లో గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో 100వ ర్యాంకు లభించిందని ఉపకులపతి డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ జూన్ 12న‌ వెల్లడించారు. దేశంలో 935 విశ్వవిద్యాలయాలు ఉండగా, అందులో తమ సంస్థకు 100వ స్థానం దక్కిందని, ఇంజినీరింగ్‌ విభాగంలోనూ 118వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. బహుళ జాతి కంపెనీలు తమ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే వెసులుబాటు ఉందన్నారు.