• facebook
  • whatsapp
  • telegram

ఎస్‌ఆర్‌ఎంలో ఈ-కౌన్సెలింగ్‌తో ప్రవేశాలు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాడు చెన్నై శివారులోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో (ఎస్‌ఆర్‌ఎంఐఎస్‌టీ) ఈ-కౌన్సెలింగ్‌, ఇంటర్వ్యూల ద్వారా పలు కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు యాజమాన్యం జూన్ 12న‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంటెక్‌, ఎంబీఏ, బీబీఏ, హోటల్‌ మేనేజ్‌మెంట్, హెల్త్‌ సైన్స్‌ సంబంధిత కోర్సులు (మెడికల్‌, డెంటల్‌ మినహా), సైన్స్‌ హ్యుమానిటీస్‌ యూజీ, పీజీ కోర్సులకు ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు www.srmist.edu.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. బీటెక్‌ ప్రవేశాలకు మాత్రం జులై 30 నుంచి ఆగస్టు 4వరకు నిర్వహించే ఎస్‌ఆర్‌ఎంజేఈఈఈ రాయాల్సి ఉంటుంది. వీటి ర్యాంకుల ఆధారంగానే విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది.