• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల దాఖలుకు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపల్‌ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తుతోపాటు, అవసరమైన పత్రాలు సమర్పించే గడువును జూన్ 20 వరకు పొడిగించినట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులు రిజిస్టర్డ్‌ పోస్టు లేదా వ్యక్తిగతంగా సంక్షేమ భవన్‌లోని బోర్డు కార్యాలయంలోనూ అందజేయవచ్చని వెల్లడించింది.