• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ, పీజీ పరీక్షలపై త్వరలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో డిగ్రీ, పీజీ స్థాయి సెమిస్టర్‌ పరీక్షలపై త్వరలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో డిగ్రీ, పీజీ స్థాయి పరీక్షలను రద్దు చేశారు. విద్యార్థులు పరీక్షలు రాయాలంటే ముందు హాస్టళ్లు తెరవాల్సి ఉంటుంది. వాటిపై కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడలేదు. జూన్ 15 తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, ఆయా వర్సిటీల ఇన్‌ఛార్జి వీసీలతో సమావేశం నిర్వహించి ఈ అంశాలపై చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.