• facebook
  • whatsapp
  • telegram

కంపెనీ సెక్రెటరీస్‌ పరీక్ష మళ్లీ వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: కంపెనీ సెక్రెటరీస్‌ ఫౌండేషన్‌, ఎగ్జిక్యూటివ్‌, ప్రొఫెషనల్‌, పోస్టు మెంబర్‌షిప్‌ క్వాలిఫికేషన్‌ పరీక్షలు మరోసారి వాయిదాపడ్డాయి. జూన్‌లో జరగాల్సిన ఈ పరీక్షలను కరోనా కారణంగా జులై 6 నుంచి 16వరకు నిర్వహిస్తామని గతంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. తాజాగా పరీక్షలను ఆగస్టు 18 నుంచి 28వరకు నిర్వహిస్తామని తెలిపింది.