• facebook
  • whatsapp
  • telegram

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే బోధనా సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సీఎం కేసీఆర్‌కు జూన్‌ 13 న లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఉపాధ్యాయులకు అంతర్‌ జిల్లాల బదిలీలు జరగలేదని, జూనియర్‌ కళాశాలల ఒప్పంద అధ్యాపకులు ఎంతో మంది భార్యాభర్తలు ఒక్కోచోట నివాసం ఉండటానికి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.