• facebook
  • whatsapp
  • telegram

జులై 11 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ విద్యా మండలి విడుదల చేసింది. జులై 11 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరగనున్నాయి.  ప్రాక్టీకల్‌ పరీక్షలు 1 నుంచి 4 వరకు రెండు విడతల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. నైతికత, మానవీయ విలువలు 5న, పర్యావరణ విద్య పరీక్ష 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. పరీక్ష రుసుము చెల్లింపునకు జూన్‌ 23 వరకు అవకాశం కల్పించారు. మరోవైపు ఇంటర్‌ మార్కుల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాలు విడుదలకాని విద్యార్థుల వివరాలను పంపించాలని ప్రిన్సిపాళ్లకు ఇంటర్‌ విద్యామండలి సూచించింది.