• facebook
  • whatsapp
  • telegram

జట్టు ఆటలు లేని పీఈసెట్‌!

ఈనాడు, హైదరాబాద్‌: ఈసారి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(పీఈసెట్‌)లో జట్టుగా ఆడే ఆటలు ఉండవు. కరోనా ప్రభావం నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు పీఈసెట్‌లో మార్పులు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈసారి కేవలం వ్యక్తిగత శారీరక సామర్థ్యం (ఫిట్‌నెస్‌)ను పరీక్షించే కొన్ని క్రీడలతోపాటు వివిధ ఆటల్లో నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ప్రశ్నల రూపంలో పరీక్షించనున్నారు. రెండేళ్ల బీపీఎడ్‌, డీపీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా పీఈసెట్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఈ పరీక్షలో మొత్తం 500 మార్కుల్లో 400 మార్కులకు ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తారు. 100 మార్కులకు 11 రకాల ఆటలు ఆడిస్తారు. అయితే, ఈసారి కరోనా ప్రభావం నేపథ్యంలో వ్యక్తిగతంగా పాల్గొనేవి మినహా జట్టుగా ఆడే ఆటలు ఉండవు. దీనిపై జూన్ 17న జరిగే పీఈసెట్‌ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు 5 వేల దరఖాస్తులు అందగా.. జూన్ 20వ తేదీ వరకు గడువు ఉన్నందున మరో 1000 వరకు అందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.