• facebook
  • whatsapp
  • telegram

విద్యాభ్యాసం తర్వాత నాలుగేళ్లు పనిచేసుకోనివ్వాలి

* బ్రిటన్‌ ప్రభుత్వానికి తాజా నివేదిక సూచన

లండన్‌: విదేశీ విద్యార్థులు విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే పోస్ట్‌-స్టడీ వీసాను నాలుగేళ్ల కాలానికి ఇవ్వాలని జూన్ 15న‌ లండన్‌లో విడుదలైన ఒక నివేదిక బ్రిటన్‌ ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాల్లో 2024 నాటికి భారత విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేయడానికి వీలవుతుందని పేర్కొంది. బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల శాఖ మాజీ మంత్రి జో జాన్సన్‌ ఈ నివేదికను తయారుచేశారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత సదరు దేశంలో ఉండగలుగుతామా లేదా అన్న అంశానికి భారత విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని నివేదిక వివరించింది.