• facebook
  • whatsapp
  • telegram

9, 10 తరగతులనైనా ప్రారంభించండి: పీఆర్‌టీయూ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 70 శాతం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని ప్రారంభించాలని, కనీసం 9, 10 తరగతులను అయినా మొదలుపెట్టాలని పీఆర్‌టీయూ తెలంగాణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది. ఆలస్యమైతే పేద కుటుంబాల విద్యార్థులు విద్యకు దూరమవుతారని, కొద్దిగా ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్‌ పాఠశాలలను ఆశ్రయించే అవకాశం ఉందని సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య ఆందోళన వ్యక్తంచేశారు.