• facebook
  • whatsapp
  • telegram

8, 9, 10 విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8, 9, 10 చదివే విద్యార్థులకు ఇంటి నుంచే చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశించారు. జూన్‌ 19 నుంచి 30 లోగా పోటీలు నిర్వహించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. జిల్లా డిప్యూటీ విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు బాధ్యత తీసుకుని ప్రధానోపాధ్యాయులకు తగిన సూచనలు చేయాలన్నారు. లాక్‌డౌన్‌లో ఇళ్లలో ఉంటున్న విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని సూచించారు.