• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఎంసెట్‌ కేంద్రాలను మార్చుకున్న విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ‘తెలంగాణ ఎంసెట్‌’కు దరఖాస్తు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాల నగరాలను మార్చుకున్నారు. వారిలో హైదరాబాద్‌లో రాసేందుకు మొదట దరఖాస్తు చేసుకున్న దాదాపు 2,500 మంది ఏపీలో పరీక్షకు హాజరయ్యేందుకు ఆప్షన్‌ ఇచ్చుకున్నారు. జూన్ 23న‌ సాయంత్రం 6 గంటల వరకు 7,600 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారని ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. అర్ధరాత్రి వరకు అప్షన్లు ఇచ్చుకున్న వారి సంఖ్య 8 వేల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. గతంలోని నాలుగు నగరాలతోపాటు కొత్తగా విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరులోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో విద్యార్థులు తమ సమీప నగరంలో పరీక్ష రాసేందుకు ఆప్షన్‌ ఇచ్చుకున్నారని చెప్పారు.