• facebook
  • whatsapp
  • telegram

ఒకేసారి శిక్షణకు పాలిటెక్నిక్‌ విద్యార్థులు  

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ ఐదో సెమిస్టర్‌ విద్యార్థులందర్నీ జులై 1 నుంచి ఒకేసారి పరిశ్రమల్లో శిక్షణకు పంపించాలని సాంకేతిక విద్యామండలి జారీ చేసిన ఆదేశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా మూడో ఏడాది విద్యార్థుల్లో సగం మందిని ఒకసారి, మిగతావారిని మరోసారి పరిశ్రమల్లో శిక్షణకు పంపిస్తారు. ఈసారి అందర్నీ ఒకేసారి పరిశ్రమల్లో శిక్షణకు పంపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.