• facebook
  • whatsapp
  • telegram

క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ విశ్వవిద్యాలయానికి చోటు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ విశ్వవిద్యాలయానికి చోటు దక్కింది. 50 ఏళ్ల లోపు చరిత్ర కలిగి, అత్యంత వేగంగా ఎదుగుతున్న విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం పొందింది. జూన్ 24న‌ విడుదల చేసిన ఈ జాబితాలో దేశవ్యాప్తంగా మరో మూడు విశ్వవిద్యాలయాలకు చోటు దక్కింది. ఉత్తమ విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ, ఉత్తమ బోధనా విధానం, సిబ్బంది, విద్యార్థుల నిష్పత్తి అంతర్జాతీయ సిబ్బంది, అంతర్జాతీయ విద్యార్థుల విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకే ఈ అరుదైన గౌరవం దక్కిందని హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ ఉపకులపతి పి.అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు.