• facebook
  • whatsapp
  • telegram

పాలిసెట్‌పై త్వరలో నిర్ణయం!

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు, ప్రవేశ పరీక్ష పాలిసెట్‌పై అధికారులు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. పాలిసెట్‌ నిర్వహిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒకవేళ రద్దు చేస్తే ప్రవేశాలు ఎలా నిర్వహించాలనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నందున ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. పాలిసెట్‌కు ఏటా సుమారు 1.30 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు.