• facebook
  • whatsapp
  • telegram

వరంగల్‌  నిట్‌లో కొత్త కోర్సు

నిట్‌క్యాంపస్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ నిట్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్‌లో కొత్తగా స్మార్ట్‌గ్రిడ్‌ టెక్నాలజీ కోర్సు అందుబాటులోకి రానుందని వరంగల్‌ నిట్‌ సంచాలకుడు ఆచార్య రమణారావు చెప్పారు. ఏబీబీ పవర్‌ గ్రిడ్‌ ఇండియా సంస్థతో వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్‌ఐటీ)ల మధ్య జూన్ 25న  పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరిందని ఆయన చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు పవర్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేలా అవసరమైన స్మార్ట్‌గ్రిడ్‌ను రూపొందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు. ఆన్‌లైన్‌లో ఒప్పంద పత్రాలపై ఏబీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.వేణు, ఎన్‌ఐటీ డైరెక్టర్‌ ఆచార్య ఎన్‌.వి.రమణారావు సంతకాలు చేశారు. కార్యక్రమంలో నిట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌.గోవర్ధన్‌రావు, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యం తదితరులున్నారు.