• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో మిగిలిన పరీక్షలు రద్దు

ఈనాడు, దిల్లీ: కరోనా కారణంగా జులైకి వాయిదా వేసిన 10, 12 తరగతుల పరీక్షలను సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులు రద్దు చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. జులైలో పరీక్షలు నిర్వహించవద్దని పలువురు తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై జూన్ 25న  న్యాయస్థానం విచారణ చేపట్టింది. గత మూడు అంతర్గత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది మార్కులు పొందడానికి, లేదా తర్వాత మళ్లీ పరీక్షలు రాయడానికి సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. ఇలాంటి అవకాశం సీబీఎస్‌ఈ 10వ తరగతి వారికి, ఐసీఎస్‌ఈ 10, 12 తరగతుల వారికి లేదన్నారు.