• facebook
  • whatsapp
  • telegram

బీసీ గురుకులాల సొసైటీ ఫలితాలు విడుదల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇంటర్‌ ప్రవేశాల కోసం 2,080 మంది అర్హత సాధించినట్లు బీసీ సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి కృష్ణమోహన్‌ తెలిపారు. రాష్ట్రంలోని 14 గురుకుల కళాశాలల్లో వీరికి ప్రవేశాలు కల్పిస్తామని జూన్ 26న  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థుల వివరాలు www.mjpapbcwr.in వెబ్‌సైట్‌లో ఉంటాయని వెల్లడించారు.