• facebook
  • whatsapp
  • telegram

హాల్‌టికెట్లపై కరోనా కట్టడికి సూచనలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లపై కరోనా మహమ్మారి కట్టడికి సంబంధించిన సూచనలను ముద్రించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జులై ఒకటో తేదీ నుంచి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని హాల్‌టికెట్లపై ప్రత్యేకంగా సూచనలను పొందుపరచనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, శానిటైజర్‌ సీసా వెంట తెచ్చుకోవాలని, పరీక్షా కేంద్రం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయించుకోవడంతో పాటు భౌతికదూరం పాటించాలనే సూచనలను వాటిపై ముద్రిస్తున్నారు. హాల్‌టికెట్‌ వెనక వైపు తనకు కరోనా లక్షణాలు లేవని ఒక డిక్లరేషన్‌ను సైతం ముద్రిస్తున్నారు. విద్యార్థులు దానిపై సంతకం చేసి పరీక్షకు హాజరుకావాలి.

నేటి నుంచి పీజీఈసెట్‌ హాల్‌టికెట్లు

జులై ఒకటో తేదీ నుంచి పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌(పీజీఈసెట్‌) జరగనున్నందున సంబంధిత హాల్‌టికెట్లను జూన్ 27  నుంచి వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య కుమార్‌ తెలిపారు.