• facebook
  • whatsapp
  • telegram

‘ప్రైవేట్’లో తెలుగు మాధ్యమం కోసం అధికారుల్ని ఆశ్రయించండి

ఈనాడు, అమరావతి: ప్రైవేటు పాఠశాలల్లోనూ తెలుగు మాధ్యమాన్ని అమలు చేసే అంశంపై సంబంధిత అధికారుల్ని కోరేందుకు పిటిషనరుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ బట్టు దేవానంద్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. గరీబ్‌ గైడ్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భార్గవి హైకోర్టులో దీనిపై వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. అధికారుల్ని ఆశ్రయించేందుకు పిటిషనరుకు అవకాశం ఇచ్చింది.