• facebook
  • whatsapp
  • telegram

నర్సింగ్‌, పారా మెడికల్‌ విద్యార్థులకు ‘కొవిడ్‌’ శిక్షణ!

ఈనాడు, అమరావతి: కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరిగిపోతుండటంతో వైద్య విద్య, నర్సింగ్‌, పారా మెడికల్‌ కోర్సులు చదివే తుది సంవత్సరం విద్యార్థుల సేవలు పొందేందుకు వైద్యారోగ్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాల వారీగా విద్యార్థుల వివరాలను సేకరించి, వారికి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక వైద్య బృందాలు శిక్షణ ఇస్తున్నాయి. విధుల్లో చేరినప్పటి నుంచి వారికి గౌరవ పారితోషికం అందజేస్తారు.