• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించండి

* పాఠశాల యాజమాన్యాలకు ట్రస్మా సూచన

ఆన్‌లైన్‌ తరగతులు వద్దని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేనందున వాటిని నిర్వహించుకోవచ్చని తెలంగాణ గుర్తింపు పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) పాఠశాలల కరస్పాండెంట్లకు సూచించింది. ఈ మేరకు  జూన్ 27న  ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను వ్యాపార దృకృథంతో చేస్తున్నాయని మాత్రమే కొందరు తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారని పేర్కొంది. ఆన్‌లైన్‌ తరగతుల కోసం చెల్లింపులు చేయాలని అడగవద్దని, విద్యార్థులకు నష్టం జరగకుండా, ఉపాధ్యాయులను కాపాడే విధంగా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని ట్రస్మా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు సూచించింది.