• facebook
  • whatsapp
  • telegram

వెబ్‌సైట్లో ‘పది’ షార్ట్‌ మెమోలు

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి పొట్టి (షార్ట్‌) మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం వెబ్‌సైట్లో ఉంచింది. మార్కుల ధ్రువపత్రంపై విద్యార్థి ఫొటోను చేర్చి వెబ్‌సైట్లో ఉంచారు. వాటిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకొని సంతకం చేసి విద్యార్థులకు అందించాలి. ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం తాత్కాలికంగా ఉపయోగించుకునేందుకు పొట్టి మెమోలను జారీచేస్తారు. వాటిల్లో ఏమైనా తప్పులున్నట్లు గుర్తించి విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే అసలు (లాంగ్‌) మెమోలలో మార్పు చేస్తారు. నెల తర్వాత వాటిని పాఠశాలలకు పంపిస్తారు.