• facebook
  • whatsapp
  • telegram

ఆదర్శ పాఠశాలలకు యూట్యూబ్‌ ఛానెల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆదర్శ పాఠశాలల తరఫున ప్రత్యేకంగా ఓ యూ ట్యూబ్‌ ఛానెల్‌ను సోమవారం ప్రారంభించారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుంటే వాటిని రికార్డు చేసి యూ ట్యూబ్‌లో ఉంచడంతో పాటు లైవ్‌ బోధన కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు ఈ ఛానెల్‌ను వినియోగించుకోవచ్చు. త్వరలోనే దానికో పేరు పెట్టనున్నారు.