• facebook
  • whatsapp
  • telegram

ఎంబీబీఎస్‌ సీట్లు పెరగాలి: గవర్నర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పరిధి వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య పెంచేందుకు కృషిచేయాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. 4కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో కేవలం 4,790 సీట్లున్నందున వాటి సంఖ్య పెంచాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలు కరోనాపై ప్రజలను చైతన్యపరిచి, పోరులో భాగస్వాములను చేయాలన్నారు. సోమవారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులతో గవర్నర్‌ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య పెంచడానికి అనుమతుల కోసం కృషిచేయాలని చెప్పారు. సమావేశంలో విశ్వవిద్యాలయ వీసీ కరుణాకర్‌ రెడ్డి, రిజిస్ట్రార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.