• facebook
  • whatsapp
  • telegram

ఆగస్టు 22న సీఎల్‌ఏటీ

ఈనాడు, దిల్లీ: కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ 2020 (సీఎల్‌ఏటీ 2020)ను ఆగస్టు 22న నిర్వహించాలని కన్సార్టియం ఆఫ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీస్‌ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తు గడువు జులై 10 వరకు పొడిగించినట్లు పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఆగస్టు 22న కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌, పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది.